‘హృతిక్‌తో అందుకు నిరాకరించిన కంగనా రనౌత్..’

by Shyam |   ( Updated:2021-09-03 02:06:08.0  )
‘హృతిక్‌తో అందుకు నిరాకరించిన కంగనా రనౌత్..’
X

దిశ, సినిమా : బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్, హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య ఎప్పటినుంచో లీగల్ ఇష్యూస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బీటౌన్‌లో ఫేమస్ లిరిసిస్ట్‌గా పేరుపొందిన జావేద్.. ఈ బ్యూటీపై పెట్టిన పరువు నష్టం కేసు విచారణను బాంబే హైకోర్టు ఇటీవలే వాయిదా వేసింది. అంతేకాదు కేసు రద్దు చేయాలని కోరుతూ కంగనా రనౌత్ చేసిన పిటిషన్‌పై తన ఆదేశాన్ని రిజర్వ్ చేసింది.

కాగా, జావేద్ అక్తర్ 2016లో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌కు ఫోన్ చేసి, హృతిక్ రోషన్‌తో సమస్యలను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చినట్లు తాజా విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్‌ను శాంతింపజేసే ప్రయత్నాల్లో భాగంగానే తనను 2016లో కలిశానని, కానీ ఆమె తన మాట వినలేదని ఆయన వివరించారు. పైగా తనకు నచ్చినట్లుగా సమస్యను పరిష్కరించుకుంటానని చెప్పిందన్నారు.

కాగా ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్.. జావేద్‌ ‘పరువుకు నష్టం కలిగించేలా నిరాధారమైన వ్యాఖ్యలు’ చేసింది. దీంతో గతేడాది నవంబర్‌లో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆయన కంగనా రనౌత్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. PTI ప్రకారం, పరువు నష్టం ప్రక్రియను సవాలు చేస్తూ రనౌత్ వేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 9న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed