- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చాత్ పూజపై జార్ఘండ్ ప్రభుత్వం బ్యాన్..!
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర భారతంలో మహిళలు పవిత్రంగా నిర్వహించుకునే చాత్ పూజపై జార్ఘండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ పూజను నదిలో దిగి పుణ్యస్నానాలు ఆచరిస్తూ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వలన కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.అందువల్లే చాత్ పూజపై బ్యాన్ విధిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరేన్ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా సోమవారం విడుదల చేసింది.
ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం.. చాత్ పూజ నిర్వహించే వారు నది నీటిలో దిగరాదు. ఎందుకంటే నీటిలో 6 అడుగుల సామాజిక దూరం వహిస్తూ పూజ చేయడం అనేది అసాధ్యం. ఒక వేళ అలా పుణ్యస్నానాలు ఆచరించినా ఒకరి శరీరాన్ని తాకిన నీరు మరొకరి శరీరాన్ని తప్పకుండా తాకుతుంది. దీంతో వైరస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జార్ఘండ్ ప్రభుత్వం ముందస్తు ఆలోచన చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని ఈత కొలనులను తిరిగి తెరవకపోవడానికి కూడా అదే కారణంగా తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా పబ్లిక్ ఏరియాల్లో చాత్ పూజ నిర్వహణపై బ్యాన్ విధించగా, ఈ తంతుపై బ్యాన్ విధించిన రెండో రాష్ట్రంగా జార్ఘండ్ నిలిచింది. అయితే, ఈ రెండు ప్రభుత్వాల నిర్ణయంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు