వకీల్ సాబ్ జతకట్టేది జాన్వీతోనే..

by Shyam |
వకీల్ సాబ్ జతకట్టేది జాన్వీతోనే..
X

జాన్వీ కపూర్.. శ్రీదేవి, బోనీ‌కపూర్‌ల కూతురు. ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. సౌత్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ సినిమాతోనే దక్షిణాదిన అడుగుపెడుతోంది అనుకున్నా.. ఆ చాన్స్ కాస్తా అనన్య పాండే కొట్టేసింది.

అయితే తను త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కాబోతోందని సమాచారం. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కుతోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుందనే వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అంజలి, నివేద థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మూవీ యూనిట్ పవన్ హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉంది. చివరికి జాన్వీ దగ్గర ఈ సెర్చ్‌కు ఫుల్‌స్టాప్ పడినట్లు తెలుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పింక్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే సోషల్ మీడియా రికార్డులు బ్రేక్ చేయగా.. ఇక ఈ సినిమాకు జాన్వీ తోడైతే మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Advertisement

Next Story