లాక్ డౌన్ కాలం నన్ను మార్చేసింది : జాన్వీ

by Shyam |
లాక్ డౌన్ కాలం నన్ను మార్చేసింది : జాన్వీ
X

కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతుంది. ప్రజల జీవన వ్యవస్థను మార్చేసింది. అయితే ఈ మార్పు … తనలో భారీ మార్పును తీసుకొచ్చిందని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. లాక్ డౌన్ సమయం… భోజనానికి విలువ ఇవ్వడం నేర్పిందని తెలిపింది. అవసరానికి మించిన భోజనం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్న జాన్వీ… ఇంట్లో రేషన్ అయిపోతే ఓ వ్యక్తి వాటిని తీసుకురావడానికి బయటకి వెళ్లాల్సి వస్తుందని… అది అతనికి ప్రమాదం అని… నేను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా భయపడలేదని చెప్పింది. కానీ ఇప్పుడు అర్ధం అవుతుందని తెలిపింది.

నా తండ్రి నన్ను మిస్ అవుతున్నారని… నా కోసం, నాతో గడిపేందుకు వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని అర్ధం చేసుకున్నానని తెలిపింది. నేను చాలా విషయాల్లో చాలా మందిపై ఆధారపడుతున్న విషయాన్ని గ్రహించాను అంటున్న జాన్వీ… నా ఇంటికి నేను అవసరం… వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని తెలుసుకున్నానంది. రోజులో ఇన్ని గంటలున్నాయని అర్థమైందని…. అనవసర ప్లాన్స్ తో టైమ్ వేస్ట్ చేస్తున్నామని చెబుతోంది. ఇంకా అమ్మ తన డ్రెస్సింగ్ రూంలో ఉందన్న ఫీల్ ను ఫీల్ అవ్వడాన్ని నేర్చుకున్నానని…. ముఖ్యంగా సినిమాను ప్రేమించడం .. సినిమాతో జీవించడం నేర్చుకున్నాను అంటోంది.

Tags: janhvi kapoor, Bollywood, CoronaVirus, lockdown

Advertisement

Next Story

Most Viewed