రైతుల ఆందోళనతో జాన్వీ మూవీ షూటింగ్‌కి బ్రేక్

by Shyam |
రైతుల ఆందోళనతో జాన్వీ మూవీ షూటింగ్‌కి బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్‌కు బ్రేక్ పడింది. సినిమా చిత్రీకరణ కోసం కొన్ని రోజుల క్రితమే జాన్వీ పంజాబ్‌లోని పటియాలకు వెళ్లగా.. భూపిందర్ రోడ్‌లో ఫిల్మింగ్ జరుగుతోంది. రైతుల నిరసనతో సినిమా షూటింగ్ నిలిపివేసింది మూవీ యూనిట్. చిత్రీకరణ జరుగుతున్న ప్లేస్‌కు చేరుకున్న రైతులు ‘జాన్వీ గో’ బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పాటు బాలీవుడ్ నుంచి తమకు మద్దతు లేదని..కనీసం దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదని రైతులు ఫైర్ అయ్యారు. ఫార్మర్స్ ప్రొటెస్ట్‌పై జాన్వీ తన ఒపీనియన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతుల ఆందోళన కారణంగా జాన్వీ‌తో పాటు మిగిలిన మూవీ యూనిట్ సభ్యులు షూటింగ్ ఆపేసి హోటల్‌కు చేరుకున్నారు. రైతులు ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయమై మూవీ యూనిట్ కానీ, హోటల్ సిబ్బంది కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ్ మూవీ ‘కోలమవు కోకిల’ రీమేక్‌గా వస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’లో జాన్వీ లుక్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మిడిల్ క్లాస్ అమ్మాయిగా పంజాబీ డ్రెస్‌లో కనిపించిన జాన్వీ‌కి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందనే నమ్మకంతో ఉంది. సిద్దార్థ్ సేన్ గుప్తా డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను ఆనంద్ ఎల్.రాయ్ నిర్మిస్తున్నారు. దీపక్ దొబ్రియల్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం షూటింగ్ జనవరి 11 నుంచి ప్రారంభమైంది. రైతుల ఆందోళనతో ప్రస్తుతం చిత్రీకరణ నిలిచిపోయింది.

Advertisement

Next Story