నాకు, గుంజన్‌కు అదే పోలిక : జాన్వీ

by Shyam |
నాకు, గుంజన్‌కు అదే పోలిక : జాన్వీ
X

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలి సినిమా ‘ధడక్’తోనే సూపర్ హిట్ అందుకుంది. చాలా గ్యాప్ తర్వాత తన నుంచి వస్తున్న చిత్రం ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’. గుంజన్ సక్సేనా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా గుంజన్‌గా జాన్వీ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ.. గుంజన్ జీవితం ప్రతీ ఆడపిల్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని.. సినిమా అంచనాలకు మించి అద్భుతంగా ఉండబోతుందని చెబుతోంది.

https://www.instagram.com/p/CDvhI0XA34m/?igshid=vk1upzi3iw17

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జాన్వీ.. ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. గుంజన్ పాత్రలో నటించిన తనకు, గుంజన్ పోలికలు చాలా ఉన్నాయని చెప్పింది. మా ఇద్దరికీ భోజనం అంటే చాలా ఇష్టమని.. ఇద్దరికీ కూడా పొడుగు చేతులు ఉంటాయని చెప్పింది. అంతకు మించి ఇద్దరం కూడా ప్రపంచంలోనే గొప్ప తండ్రిని కలిగి ఉన్నామని తెలుపుతూ.. బోనీ కపూర్ తనను అపురూపంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసింది జాన్వీ. తన అతిపెద్ద చీర్ లీడర్‌గా తండ్రిని పొగిడిన జాన్వీ.. ఇబ్బందికి గురిచేస్తున్నందుకు సారీ చెప్పింది.

ఈ పోస్ట్‌పై అందరూ ‘క్యూట్ ఫొటో.. లవబుల్ డాడ్ అండ్ డాటర్’ అని కాంప్లిమెంట్స్ ఇస్తుండగా.. హీరో కార్తిక్ ఆర్యన్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా స్పందించారు. ఏంటి నువ్వు మీ డాడీకి సారి చెప్తున్నావా? నేను విన్నది నిజమేనా? అన్నట్లుగా ఓ ఎమోజీ పెట్టాడు.

Advertisement

Next Story

Most Viewed