- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పవనాలు’ యూ టర్న్..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరుగుతోంది. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మూడు, నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకొని వెంటనే కటీఫ్ చెప్పారు. అంతేకాదు మొన్నటికి మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారు. ఈ క్రమంలోనే రెండ్రోజుల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పెద్దలను కలిసి చర్చలు జరపుతుండటంతో వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు పొడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ మళ్లీ యూటర్న్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అమరావతి పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ బీజేపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో బీజేపీతో యూటర్న్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీతో స్నేహాన్ని జనసేన పార్టీ వదులకుంటుందని మనసులో మాటను బయటపెట్టడంతో రాజకీయనేతలు, విశ్లేషకులు నుంచి తలోవిధంగా అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికిప్పుడే పవన్ కల్యాణ్ తొందరపడి కామెంట్లు చేశారని కొందరు అంటుంటే కేంద్ర పెద్దలు, రాష్ట్ర నేతలు ఎవ్వరూ పొత్తు విషయంపై అధికారిక ప్రకటన చేయకుండానే ఇలా మాట్లాడటంతో పవన్ కల్యాణ్ స్టాండ్‌పై మళ్లీ అనుమానాలు కలుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకొని అందర్నీ దూరం చేసుకున్న ఆయన ఇప్పుడు బీజేపీతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఏం జరగక ముందే ఇలా మాట్లాడటం ఏంటని అభిప్రాయపడుతున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకొని వైసీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరితే అప్పుడు బీజేపీకి రాం రాం చెప్పినా ప్రజల్లో ఓ విధమైన చర్చ జరిగి జనసేనకు పాజిటివ్ టాక్ వచ్చేదని, ఏం జరగక ముందే ఇలా మాట్లాడటం వల్ల అటు బీజేపీలో కూడా చర్చ జరిగి.. పవన్ కల్యాణ్‌తో పొత్తును వదులుకునేందుకు మార్గాలు సుగమం చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రచారం జరుగుతున్న సమయంలోనే కంగారుపడి పొత్తు విషయంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ అధిష్ఠానం సైతం పవన్ కల్యాణ్‌తో ఫ్రెండ్‌షిప్‌పై లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యంత బలమైన నాయకుడైనా జగన్‌తో కలిసి కొనసాగడమా లేకుంటే రెండు చోట్ల ఓడిపోయి రాష్ట్రవ్యాప్తంగా 6 శాతం ఓట్లు సంపాదించుకున్న పవన్‌తో కలిసి వెళ్లడమా అనేది కషాయం పార్టీ మొత్తం లెక్కలు బయటకు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే కర్నూలు, అమరావతిలో పర్యటించిన పవన్.. బీజేపీ నేతలకు సమాచారం అందించకుండా వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న బీజేపీ, జనసేన పొత్తుపై ఇలాంటి కామెంట్లు చేయడంతో పవన్ మళ్లీ యూటర్న్ తీసుకోబోతున్నారన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు ఆవేశంగా రాజకీయాలు చేస్తున్నాడని టాక్ నడుస్తున్న నేపథ్యంలోనే.. బీజేపీకి బ్రేకప్ చెప్పి యూటర్న్ తీసుకుంటారా లేకుంటే బీజేపీ, వైసీపీ కలిసినా.. కొనసాగుతారా అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీకి బైబై చెబితే మళ్లీ ఫ్యూచర్‌లో కలిసే వెసులుబాటు ఉండదు కాబట్టి పవన్ ఏ దిశగా అడుగులు వేస్తారన్నది పాలిటిక్స్‌లో కీలకంగా తీవ్ర చర్చకు దారి తీస్తుంది.