పవన్ కళ్యాణ్‌కు షాక్.. పోయిన గ్లాసు గుర్తు!

by Shyam |   ( Updated:2021-04-17 01:24:15.0  )
Pawan Kalyan, janasena glass symbol
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి, హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌కు, జనసైనికులకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే… ఈ ఎన్నికల పోటీలో జనసేన తన గ్లాసు గుర్తును కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన GHMC ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లలో కూడా పోటీచేయని కారణంగా పార్టీ కామన్‌ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు.

janasena glass symbol

అంతేగాకుండా.. జనసేనతో పాటు, ఇండియన్‌ ప్రజా పార్టీ, ప్రజాబంధు పార్టీ, ఎంసీపీఐ(యూ) పార్టీ, హిందుస్థాన్‌ జనతా పార్టీలు తమ తమ గుర్తులను కోల్పోయాయి. ఈ నేపథ్యంలో మిగతా పార్టీల పరిస్థతి ఎలా ఉన్నా.. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తున్న పవన్‌కు ఈ షాక్‌ తీరని నష్టంగా పలువురు భావిస్తున్నారు. కాగా, తెలంగాణలో త్వరలో జరుగనున్న ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో పోటీచేయాలని జనసేన భావిస్తోంది. అందుకే… తమ అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కామన్‌ సింబల్‌గా కొనసాగించాలని ఎస్‌ఈసీని జనసేన కోరింది. కానీ.. జనసేన ఇచ్చిన వినతిపత్రంలో అంశాలు సంతృప్తికరంగా లేవని SEC స్పష్టం చేసింది. అందుకే ఈ వినతిని ఒప్పుకోవట్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు.

Advertisement

Next Story