- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరు పెంచిన జనసేనాని.. నేడు ఏపీకి పయనం
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఇటీవల కరోనా కారణంగా కొన్నిరోజులు ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా వేగాన్ని పెంచారు. ఒక పక్క సినిమాలతో, మరో పక్క రాజకీయ పర్యటనలతో పవన్ డైరీ బిజీగా మారిపోయింది. ఆరు నెలల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొననున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై కూడా పవన్ నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే నేడు పవన్ ఏపీ లో పర్యటించనున్నారు. అక్కడ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, పన్నుల పెంపు, కృష్ణాజలాల వివాదాలపై పవన్ చర్చించనున్నట్లు తెలుస్తుంది.
మంగళవారం రాత్రే అమరావతి చేరుకోవాల్సి ఉండగా.. వాతావరణ సమస్యలతో బుధవారం ఉదయం పవన్ అమరావతి చేరుకోనున్నారు. చేరిన వెంటనే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కరోనాతో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి పవన్ పర్యటన ఒకరోజు మాత్రమే ఖరారైందని, అవసరం ఉంటే రెండో రోజు కూడా ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.