- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయింది: పవన్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రణాళిక లేని తీరుతో నిరుద్యోగులు నిరాశాస్పృహలు నెలకొన్నాయన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణపై ఒకసారి పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఎ.పి.పి.ఎస్.సి. నుంచి ప్రతీ యేటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ఇస్తామని ఏళ్లు గడుస్తున్నా.. ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని పవన్ విమర్శించారు. కనీసం ఇప్పటికైనా నిరుద్యోగులు, గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి నోటిఫికేషన్లు ఇవ్వాలని..తప్పులకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు.
Next Story