వైజాగ్ ఎయిర్‌పోర్టుకు పవన్ కల్యాణ్.. స్టీల్ ప్లాంట్ వద్దకు భారీగా జనసైనికులు

by Anukaran |   ( Updated:2021-10-31 04:12:55.0  )
Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు వద్దకు జనసైనికులు భారీగా చేరుకొని సేనానికి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగులు చేస్తోన్న ఆందోళనలో పాల్గొని, వారికి సంఘీభావం తెలపనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, జనసేన అధినేత వైజాగ్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో బహిరంగ సభలో పాల్గొనడానికి ఇప్పటికే భారీగా జనసేన కార్యకర్తలు, నేతలు విశాఖ పట్టణానికి చేరుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గేటు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Next Story

Most Viewed