- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కశ్మీర్ పంచాయతీ ఎన్నికలు వాయిదా
జమ్ము కశ్మీర్‌లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎనిమిది దశల్లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్కడ నెలకొన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితుల వల్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలతోపాటు కొత్తగా స్థాపించిన జేకేపీఎం పార్టీ చీఫ్ షా ఫైజల్ సహా పలువురు ప్రధాన స్రవంతి రాజకీయ నేతలు నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలపై ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎన్నికల అధికారులతో భేటీ అయ్యారు. తమ అధినేతలను నిర్బంధంలో నుంచి విడుదల చేస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని అధికారులకు తెలిపారు. అనంతరం ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రెండు, మూడు వారాల్లో కొత్త ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని సీఈఓ ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌లో 2018లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ ఎన్నికలను ఎన్‌సీ, పీడీపీలు బహిష్కరించడంతో దాదాపు 12వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ పంచాయతీ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.