ఒమర్ అబ్దుల్లాకు కరోనా

by Shamantha N |
ఒమర్ అబ్దుల్లాకు కరోనా
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఏడాది కాలంగా ఈ వైరస్‌ను నా దరికి చేరకుండా శాయశక్తుల ప్రయత్నించాను. చివరకు నన్ను కూడా అంటుకుంది. ఈ రోజు మధ్యాహ్నం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కానీ, లక్షణాలేవీ లేవు. వైద్యుల సూచనల మేరకు ఇంటిలోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంటున్నాను’ అని ట్వీట్ చేశారు. మార్చి 30న ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శ్రీనరగ్‌లోని హాస్పిటల్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడ సాధించడంతో ఇంటిలోనే జాగ్రత్తలు తీసుకోవాలనే వైద్యుల సూచనలతో బుధవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed