- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జల్‌పల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: మంత్రి సబితా
దిశ, జల్‌పల్లి: జల్‌పల్లి మునిసిపాలిటీలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజిల నిర్మాణానికి 17 కోట్లతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, పార్టీలకతీతంగా జల్‌పల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లి మునిసిపాలిటీలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ జల్‌పల్లిగా మార్చటానికి అందరూ ముందుకు రావాలన్నారు. జల్‌పల్లి చెరువుకు 9 కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేసి, పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించటానికి, 23 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశామన్నారు. మునిసిపాలిటీలోని అన్ని పాఠశాలలకు తాగు నీరు అందేలా కనెక్షన్‌లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. మునిసిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 50 లక్షలు కేటాయించడం జరిగిందని, జల్‌పల్లి చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
పహడి షరీఫ్ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు జరిగాయన్నారు. నూతన మునిసిపల్ కార్యాలయ నిర్మాణం కోసం కృషి చేస్తామని, వైరల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఛైర్మన్ అబ్దుల్లా సాధి, వైస్ చైర్మన్ ఫర్హాన నాజ్, మున్సిపల్ కమిషనర్ జి.పి. కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.