ముద్దు సన్నివేశాల్లో నటించడం నా వల్ల కాలేదు.. స్టార్ హీరో

by Shyam |   ( Updated:2021-10-09 04:49:53.0  )
ముద్దు సన్నివేశాల్లో నటించడం నా వల్ల కాలేదు.. స్టార్ హీరో
X

దిశ, సినిమా : సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా కామన్. అయితే ఇండియన్ సినీ అభిమానులు కేవలం ముద్దు సన్నివేశాల కోసమే ఎక్కువసార్లు చూసిన సినిమా ‘ద గుడ్ గర్ల్’. 2002లో వచ్చిన ఈ సినిమా‌లో ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ స్టార్ హీరో జేక్ గైలెన్హల్, జెన్నిఫర్ అనిస్టన్ నటించగా.. మూవీ గురించి ఆసక్తకరమైన విషయం చెప్పాడు హీరో జేక్.. ‘సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించడం నరకంలా ఉండేది.

ముఖ్యంగా జెన్నిఫర్‌తో ముద్దు సన్నివేశాల విషయంలో చాలా నర్వస్ అయ్యేవాడిని. చుట్టూ 50 మంది చూస్తున్న సమయంలో ఆమెను ముద్దు పెట్టుకోవడం నా వల్ల కాలేదు. కొన్ని సందర్బాల్లో పిల్లోతో మ్యానేజ్ చేయగా మరికొన్ని సన్నివేశాలను మాత్రం తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. అయితే దానికి కారణం కూడా ఉంది. నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అంటే అవతలి వైపు నుండి కూడా ప్రేమ ఉంటే పర్వాలేదు కానీ, వన్‌సైడ్ ప్రేమ ఉన్నప్పుడు అలాంటి సన్నివేశాలు చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడుతాం’ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేక్ వివరించాడు. ఇక 2016లో తనకు జెన్నీఫర్ అంటే క్రష్ ఉన్నట్లు తెలిపిన జేక్.. ద గుడ్ గర్ల్ సినిమా నుంచి ఆమె అంటే ఇష్టం పెరిగినట్లు పేర్కొన్నాడు. కానీ అప్పటికే జెన్నిఫర్ బ్రాడ్ ఫిట్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలో సెటిల్ అయ్యింది. అయినా కూడా జేక్ ఆమెను ప్రేమించడం విశేషం.

Advertisement

Next Story