- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగిత్యాల జిల్లాలో కరోనాతో మరొకరు మృతి
దిశ, కరీంనగర్: సప్తసముద్రాలు దాటాడు.. అయినా క్షేమంగా ఉంటారనుకున్నారు అతని కుటుంబ సభ్యులు. కానీ, అది అతని దేహంలోకి ఏ రూపంలో వచ్చిందో తెలియదు.. ఆ మనిషి రూపమే లేకుండా చేసింది. అంతేకాదు కనీసం చివరి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది. దీంతో ఆ కుటుంబమంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
జగిత్యాల జిల్లాకు చెందిన మరో వలస కార్మికుడు కరోనా సోకి మృతిచెందాడు. దుబాయ్ దేశంలో ఉపాధి పొందుతున్న యాకోబ్ మంగళవారం చనిపోయినట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లాలోని మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన శింగారపు యాకోబ్ గత కొంతకాలంగా దుబాయ్ లోని అల్గోజ్ లోని ఓ కంపెనీ లో పని చేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లి తన గదికి చేరుకున్నయాకోబ్ సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతని స్నేహితులు అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించారు. మొదట గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావించిన వైద్యులు కరోనాను దృష్టిలో పెట్టుకుని టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడి మృత దేహాన్ని అక్కడే ఖననం చేశారు. యాకోబ్ కు భార్య మరియమ్మ, జోసఫ్, కిరణ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. యాకోబ్ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారం రోజుల క్రితం కోరుట్ల మండలం మోహాన్ రావుపేట్ కు చెందిన ఓ వ్యక్తి కూడా కరోనాతో మృతి చెందాడు.