పీసీసీ ఎంపికపై తొందరపడొద్దు: జగ్గారెడ్డి

by Shyam |
పీసీసీ ఎంపికపై తొందరపడొద్దు: జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో పీసీసీ చీఫ్ ఎంపికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని లేఖలో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డినే పీసీసీ చీఫ్‌‌గా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్నాకే పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయాలని, అందరి నేతల ఏకాభిప్రాయంతోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరగాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story