డిగ్రీ విద్యార్థులకు 20 వేలు.. నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి నగదు

by srinivas |
డిగ్రీ విద్యార్థులకు 20 వేలు.. నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి నగదు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. ‘జగన్ వసతి దీవెన’లో భాగంగా నేడు ఏపీ సీఏం జగన్ దాదాపు 11 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థికి 15 వేలు, ఐటిఐ విద్యార్థికి 10 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివేవారికి 20 వేల చొప్పున ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా పాలిటెక్నిక్ రూ.7,500 వేలు, ఐటిఐ రూ.5 వేలు, డిగ్రీ ఆపై వారికి రూ.10 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమచేశారు.

ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ రియంబర్స్‌ అందుతుందన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువేనని, కొవిడ్ కారణంగా ఈ సంవత్సరం సిలబస్ ఆలస్యంగా మొదలైందని జగన్ అన్నారు. వచ్చే సంవత్సరం సీబీఎస్ఈ సిలబస్‌ను తీసుకోస్తామన్నారు. పేద విద్యార్థులకు ఉన్నతవిద్య దూరం కావద్దనే విద్యారంగానికి పూర్తి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed