- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..
దిశ, ఏపీ బ్యూరో: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగించింది. ఈనెల 19 సాయంత్రం5 గంటల వరకు బాధితులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు తమ వివరాలను agrigolddata.in వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూసుకోవచ్చని తెలిపింది.
ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు. ఇకపోతే అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20వేలు లోపు డిపాజిటిట్ చేసిన డిపాజిట్‌దారులకు ఆ సొమ్ములు ఈనెల 24న ప్రభుత్వం జమ చేయనుంది. గతంలో ప్రభుత్వం రూ.10వేలలోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు చేసినా జగన్ సర్కార్ ఈసారి రూ.20వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు చేపట్టనుంది.