ఇవన్నీ మీరే చేసిపెట్టాలి.. మోదీతో జగన్

by srinivas |
ఇవన్నీ మీరే చేసిపెట్టాలి.. మోదీతో జగన్
X

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో గంటా 40 నిమిషాల భేటీలో పలు ప్రతిపాదనలు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ఆహ్వానం పేరిట జగన్ టూర్ జరిగినా.. టూర్ వెనుక బలమైన కారణం మాత్రం రాజధాని, శాసనమండలి అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ప్రధానిని జగన్ ఏం కోరికలు కోరారంటే…

తొలుత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రధానికి వివరించారు. ఈ క్రమంలో అమరావతి రీజియన్‌లో ఆందోళనల పేరిట టీడీపీ చేస్తున్న విమర్శలను వివరించారు. అనంతరం అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించారు. శాసన సభ్యులు ఆమోదించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని వివరించి.. శాసన మండలి రద్దుకు సహకరించాలని కోరారు.

సవరించిన పోలవరం అంచనాలు ఆమోదించి.. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైకోర్టును కర్నూలు తరలించేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన దిశ చట్టంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కడప స్టీల్స్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అన్నారు. రామయపట్నం పోర్టు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయమన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను ఆదుకునే చర్యలు చేపట్టాలని అడిగారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి సహకరించమని కోరారు.

Advertisement

Next Story