- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై జగన్ కీలక నిర్ణయాలు
దిశ ఏపీ బ్యూరో: బెడ్లు నిరాకరించే ధోరణి ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో నిర్వహించిన హైలెవెల్ రివ్యూ మీటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాపై అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు.
కొవిడ్ వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి? ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? ఎవరికి కాల్ చేయాలన్నదానిపై ప్రతి ఒక్కరికీ పూర్తిగా తెలియాలని చెప్పారు. ఈమేరకు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా గురించి పోస్టర్లు ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలు, అలాగే జిల్లాల్లో పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు 104, 14410 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నంబర్లు ఇచ్చామని గుర్తు చేశారు. వీటితోపాటు ప్రతి జిల్లాలో కోవిడ్ కంట్రోల్ రూం కాల్ సెంటర్ నంబర్ ఏర్పాటు చేసి, ఆ మేరకు ప్రకటనలు ఇచ్చామన్నారు.
ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్ చేసినప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయి. అన్నవిషయాన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అధికారులే కాల్ సెంటర్లకు కాల్ చేసి కాల్ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. కాల్ రాగానే సంబంధిత వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? తనిఖీ చేయాలన్నారు. ఇంకా అసలు ఆ నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? చెక్ చేయాలని అన్నారు. కొవిడ్ పాజిటివ్ కేసును గుర్తించిన తరువాత బాధితుల్ని హోం క్వారంటైన్ కి పంపాలా? లేక, కోవిడ్ కేర్ సెంటర్ కి పంపించాలా? అదీగాక జిల్లా కొవిడ్ ఆస్పత్రికి పంపితే సరిపోతుందా? లేక తప్పనిసరిగా రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రికి తరలించాలా? అన్నది ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా పంపించాలని సూచించారు.
కరోనా బాధితులకు హోంక్వారంటైన్ కోసం ఇంట్లో వసతులు ఉంటే దానినే రిఫర్ చేస్తామని తెలిపారు. ఇంట్లో ప్రత్యేక గది లేని పక్షంలో వారిని కోవిడ్ కేర్ సెంటర్‌కు రిఫర్ చేస్తామని తెలిపారు. వైద్యులు హోంక్వారంటైన్‌లో ఉన్న ఆ వ్యక్తిని పూర్తిగా పర్యవేక్షించాలని సూచించారు. డాక్టరు విధిగా బాధితుల్ని విజిట్ చేయాలన్నారు. వారికి క్రమం తప్పకుండా మందులు అందుతున్నాయా? లేదా? పర్యవేక్షించాలి. మూడు పూటలా కాల్ చేసి వారి ఆరోగ్య వివరాలను తెలుసు కోవాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో నిత్యం డాక్టర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. టైముకి నాణ్యమైన మందులు ఇస్తున్నారా? లేదా? కూడా చూడాలని సీఎం కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 128 జిల్లా ఆస్పత్రులను గుర్తించిందని వెల్లడించారు. ఈ ఆస్పత్రుల్లో 32 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఆయన ప్రకటించారు. కరోనా కారణంగా కోవిడ్ ఆస్పత్రులకు ఎవరైనా వస్తే, కేవలం 30 నిమిషాల్లో పేషెంట్ అడ్మిషన్ జరగాలని స్పష్టం చేశారు. రోగి ఎక్కడకు వచ్చినా సరే అతడి ఆరోగ్య పరిస్థితులను డాక్టర్ దృష్టిలో ఉంచుకుని ఎక్కడకు పంపాలన్నదానిని ఆయనే నిర్ణయించాలని చెప్పారు. రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసం సిద్ధంగా 8 వేల బెడ్లు ఉన్నాయని వెల్లడించారు. వీటిని క్రిటికల్ కేర్ కోసం వాడాలని స్పష్టం చేశారు. వీటన్నింటికి కలెక్టర్, జేసీలలే పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఏ ఆస్పత్రిలో కూడా నిరాకరించే ధోరణి ఉండకూడదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అలా జరిగితే కఠినచర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
బాధితులు న్యాయం కోసం కొవిడ్ కేర్ సెంటర్లు, జిల్లా కొవిడ్ ఆస్పత్రులు, రాష్ట్రస్థాయి కొవిడ్ ఆస్పత్రుల వద్ద 1902 నంబర్ డిస్‌ప్లే చేయాలని స్పష్టంగా చెప్పారు. ఆస్పత్రి సదుపాయాలపై ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెనువెంటనే స్పందించాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 128 జిల్లా ఆస్పత్రులు, 10 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు డిస్ ప్లే చేయడంతోపాటు, ఆ వివరాలు పబ్లిక్ డొమైన్‌లో ఎప్పటికప్పుడు డిస్ ప్లే చేయాలన్నారు. దాంతో పాటు ఆస్పత్రిలోని అన్ని సౌకర్యాలపై పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వీటిని బరువుగా కాకుండా మానవత్వంతో చేయాలని ఆయన సూచించారు. లేదంటే వీటి నిర్వహణకు ఒక బలమైన వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు.