జడేజాకు ఇంగ్లీష్ రాదు.. నోరు జారిన మంజ్రేకర్

by Shyam |
Manjrekar, Jadeja
X

దిశ, స్పోర్ట్స్: మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరోసారి రవీంద్ర జడేజాపై తన చులకన భావాన్ని ప్రదర్శించాడు. రవిచంద్రన్ అశ్విన్‌ అసలు ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్ కాదు అని చేసిన వ్యాఖ్యలపై మండిపడిన సూర్య నారాయణ్ అనే ట్విట్టర్ యూజర్ అతడికి ఆగ్రహంతో రీట్వీట్ చేశాడు. మంజ్రేకర్ కేవలం ట్వీట్లు, వ్యాఖ్యలతో మాత్రమే పాపులర్ అవ్వాలని ఆలోచిస్తున్నాడని… అశ్విన్ టాలెంట్‌లో 10 శాతం కూడా లేదంటూ ట్వీట్ చేశాడు. దీనికి మంజ్రేకర్ స్పందించాడు. వీరిద్దరి మధ్య పర్సనల్ చాట్ కూడా నడిచింది. అదే సమయంలో 2019 ప్రపంచ కప్ సందర్భంగా రవీంద్ర జడేజాపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించాడు.

దానికి మంజ్రేకర్ స్పందిస్తూ ‘నేను మీ అభిమానుల్లాగ ప్లేయర్స్‌ను పొగడను. నేను అభిమానిని కాదు ఒక విశ్లేషకుడిని. రవీంద్ర జడేజాకు అసలు బిట్స్ అండ్ పీసెస్ అంటే అర్థం తెలియదు. అతడికి ఇంగ్లీష్ రాదు. అతడు నాకు రిప్లై ఇస్తూ చేసిన వెర్బల్ డయేరియా అనే పదం కూడా ఎవరో చెబితే రాసుంటాడు’ అంటూ చాలా చులకన భావంతో ట్వీట్ చేశాడు. ఈ చాట్ మొత్తాన్ని సూర్య నారాయణ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. పర్సనల్ చాట్ బయటపెట్టడం మంచిది కాదని నాకు తెలుసు. కానీ మంజ్రేకర్ అసలు స్వరూపం ప్రజలకు తెలియాలనే బయటపెడుతున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed