- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ శాఖలలో పదోన్నతులు కల్పించాలి
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఉన్నతశ్రేణి ఉద్యోగాల్లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయని, ఏడాది కాలంగా పదోన్నతులు లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్ మమత అన్నారు. సీఎం కేసీఆర్ పదోన్నతుల విషయంలో గతంలో స్పందించారని, ప్రతి ఉద్యోగికి రావలసిన పదోన్నతిని ఖాళీ ఏర్పడిన రోజే అతని ఇంటికి పంపించే సాంప్రదాయం అమలు అయ్యే విధంగా పాలసీని ఏర్పాటు చేయాలన్నారని చెప్పారు. పదోన్నతుల అంశంపై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్మదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఖాళీలు, అర్హత ఉండి, సర్వీసుపరంగా మూడేళ్లు పూర్తి చేయకపోవడంతో పదోన్నతులు పొందడం లేదని, గతంలో ప్రభుత్వం నిర్ణీత సర్వీసు నిబంధనను మూడేండ్ల నుంచి రెండేండ్లకు తగ్గించడంతో పదోన్నతులు పొందినట్లు వారు వివరించారు.
చాలామంది క్రిందిస్థాయి పోస్టులో జీతాలు తీసుకుంటూ పైస్థాయి విధులు నిర్వర్తిస్తున్నారని, వారు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని, దీంతో సబార్డినేట్ సర్వీసు రూల్స్‌లో మూడేండ్ల సర్వీసు నిబంధనకు సవరణలు చేసి రెండేండ్లకు కుదించి పదోన్నతులు కల్పించాలంటూ వారు వినతిపత్రంలో కోరారు. పదోన్నతులలో సీనియారిటీ ప్రాతిపదికన రెండేండ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉద్యోగ జేఏసీ తరుపున సెక్రెటరీలు మామిళ్ల రాజేందర్, ఎనుగుల సత్యనారాయణ, జేఏసీ నేతలు వంగ రవిందర్ రెడ్డి, పద్మాచారి, డా. మధుసూదన్ రెడ్డి, మునగాల మణిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, సంజీవ, హనుమంతునాయక్, ముజీబ్ , రాయికంటి ప్రతాప్, క్రిష్ణయాదవ్, వెంకట్, గోల్కొండ సతీష్ కోరారు.