ఆంగ్ల మాద్యమమే రాజ్యాంగ విరుద్దమా?: ఐవైఆర్ అనుమానం

by srinivas |
ఆంగ్ల మాద్యమమే రాజ్యాంగ విరుద్దమా?: ఐవైఆర్ అనుమానం
X

1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంను తప్పని సరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81, 85ను హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ఉత్తర్వులు పరిశీలించిన పిదప దీనిపై పోరాటానికి సుప్రీంకోర్టుకు వెళ్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించగా.. ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టత లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కేవలం తెలుగులోనే చదవాలా? లేక తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే సౌలభ్యం ఉంటుందా? అని న్యాయనిపుణులను ప్రశ్నించారు. ఇంగ్లిష్ సహా ఏ మాధ్యమాన్ని అయినా ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థుల ప్రాధమిక హక్కు అన్న ఆయన..ఏ మీడియంలో చదవాలో విద్యార్థులకే వదిలెయ్యాలని సూచించారు.

తెలుగు, ఇంగ్లిష్‌లో ట్వీట్ చేస్తూ, నిర్బంధ ఆంగ్ల మాధ్యమం రాజ్యాంగ విరుద్ధమా లేక అసలు ఇంగ్లిష్ మీడియమే రాజ్యాంగ విరుద్ధమా? అన్న దానిపై తనకు స్పష్టత దొరకలేదని అన్నారు. నిర్బంధ ఇంగ్లిష్ మీడియం విద్యను రద్దు చేయడమైతే స్వాగతించాల్సిందేనని అన్నారు. ఎందుకంటే ఏ మీడియంలో చదవాలి అన్న అంశాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలా కాకుండా.. అసలు ఆంగ్ల మాధ్యమమే వద్దు అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్లాలి లేదా హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన సూచించారు.

tags: iyr krishna rao, ap, high court, english medium education, ap ex-cs

Advertisement

Next Story

Most Viewed