- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకులకు ఐవీఆర్‌సీఎల్ రూ. 4,387 కోట్ల టోకరా
దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ. 4,387 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంతో పాటు మోసం చేసిన వ్యవహారానికి సంబంధించి ప్రముఖ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఐవీఆర్‌సీఎల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సంస్థపైన మాత్రమే కాకుండా మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి, జాయింట్ ఎంపీ బలరామిరెడ్డి, కొద్దిమంది ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం (ఢిల్లీ) ఒక ప్రకటనలో తెలిపి,ది. ప్రభుత్వ సిబ్బంది సహకారంతో ఈ సంస్థ ఎస్బీఐ, కెనరాబ్యాంక్, ఐడీబీఐ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని కారణంగా సుమారు రూ. 4,837 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది.
ఐవీఆర్‌సీఎల్ సంస్థ ప్రతినిధులు (డైరెక్టర్లు) చాలా తెలివిగా వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ పరిమితిని పొందడంతో పాటు బ్యాంకులను మోసం చేసినట్లు తేలిందని, అప్పటికే తీసుకున్న రుణాలను చెల్లించకుండానే రకరకాల పద్ధతుల్లో కొత్త రుణాలను తీసుకుందని సీబీఐ పేర్కొంది. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు ప్రకారం ఆ సంస్థ ఎలాంటి పనులు చేపట్టకుండానే, కొనుగోళ్ళు జరపకుండానే, లావాదేవీలు చేయకుండానే, వాటికి సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లలో పేర్కొనకుండానే కొన్ని ఏజెన్సీలకు ఎల్‌సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)లను ఇచ్చిందని సీబీఐ ఆ ప్రకటనలో వివరించింది. ఇలా చెల్లింపులు చేసినట్లు పేర్కొన్న నిధులన్నీ ఆ కంపెనీ ఖాతాల్లోకి మళ్ళాయని, బ్యాంకుల నుంచి తీసుకున్నరుణాలను దుర్వినియోగం చేసిందని పేర్కొంది.
ఎస్బీఐ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఐవీఆర్‌సీఎల్ సంస్థ కార్యాలయంపైనా, దాని ప్రతినిధుల నివాసాలపైనా సోదాలు చేశామని, కీలకమైన ఎన్నో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఈ మోసాలు, అవకతవకలకుగాను సంస్థపై మాత్రమే కాకుండా ఎండీ, జాయింట్ ఎండీ, సహకారం అందించిన కొద్దిమంది ప్రభుత్వ సిబ్బందిపైనా, ఇతరులపైనా కేసులు నమోదు చేసినట్లు సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.