- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ సర్ ప్రైజ్ : ధనుష్ తో 'ఫిదా' డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరో – డైరెక్టర్ కాంబినేషన్లు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్ల తో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లబోతుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్- ప్రభాస్, ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్, శంకర్- రామ్ చరణ్ కాంబో లపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఈ కోవ లోకే మరో నెవ్వర్ బిఫోర్ కాంబో రెడీ అయ్యింది. ఎప్పటినుండో టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు వార్తలు నెట్టింట్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పుకార్లను నిజం చేస్తూ ఈ కాంబోను అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్.
https://twitter.com/SVCLLP/status/1405729715747360768?s=20
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ లో త్రిభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్ -పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. నేడు దివంగత సునీతా నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సోనాలి నారంగ్ ప్రకటించారు. ఇక ఇప్పటికే ధనుష్ లైన్ అప్ మాములుగా లేదు. ఒకపక్క ఆయన నటించిన జగమే జగమే తంత్రం ఓటిటీ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మరోపక్క అవెంజర్స్ దర్శకులు రస్సో బ్రదర్స్ తో 'ది గ్రేమ్యాన్' అనే చిత్రంలోనూ ధనుష్ నటిస్తున్నాడు. వరుసగా హాలీవుడ్, టాలీవుడ్ సినిమాలను లైన్లో పెట్టి నెట్టింట క్రేజి స్టార్ గా మారిపోయాడు ధనుష్. ఇక సెహెకర్ కమ్ముల ప్రస్తుతం లవ్ స్టోరీ ని తెరక్కేకించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ధనుష్ సినిమా పట్టాలెక్కనుంది. ధనుష్ నటన, శేఖర్ కమ్ముల సెన్సిబుల్ స్టోరీ ఈ రెండు కలిస్తే ఫాన్స్ కి పండగేగా మరీ..