ముఖేశ్ అంబానీ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన ఆయన సతీమణి

by Anjali |   ( Updated:2023-03-31 08:29:33.0  )
ముఖేశ్ అంబానీ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన ఆయన సతీమణి
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అపర కబేరులలో ఒకరనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదు అయిన ఇంట్లో యాంటిలియోలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని ముకేష్ అంబానీ గడుపుతున్నారు. ఇంగ్లాండ్‌లోని బకింగ్ హామ్ ప్యాలస్ తర్వాత ముంబయిలోని యాంటిలియా భవనం రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు అనీల్ అంబానీ నివాసం సైతం ముకేష్ అంబానీ ఇల్లు సమీపంలోనే ఉంటుందట. చాలా మంది కుబేరుల ఇళ్లు కూడా ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

అయితే అంబానీ సతీమణి నీతా అంబానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరై వారి ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంత బిజీ లైఫ్‌లో కూడా కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తామని, అలాగే దంపతులిద్దరు నైట్ డిన్నర్‌కి కూడా వెళ్తామని చెప్పారు. ‘‘అప్పుడప్పుడు బయటికి వెళ్లి స్ట్రీట్ ఫుడ్స్ తింటాం. మేము ఇప్పటికీ ఒకరితో ఒకరం ప్రేమలో ఉన్నాం. ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే నిర్ణయం తీసుకొని తప్పకుండా వెళ్తాం. అర్థరాత్రి అయినా సరే సీ లాంజ్‌కి‌ ఒక కప్పు కాఫీ కోసం, డే టైమ్‌లో అయితే స్వాతి స్మాక్స్‌కి వెళ్లి భేల్, దహి బటాతా పూరి తింటామని’’ చెప్పుకొచ్చింది. అలాగే ముఖేష్ అంబానీ ఇష్టపడే ఆహార పదార్థాల గురించి తెలుపుతూ.. ‘గుజరాతీ స్థానిక ఆహార పదార్థాలంటే ఆయనకు చాలా ఇష్టం. ఇంట్లో వండినటువంటి వంటకాలనే ఎక్కువ ఇష్టపడతారు. ‘‘ భేల్, దహి బలాతా పూరి’’ ఈ రెండు డిసెష్‌ను ఎల్లప్పుడూ ఆయనకి ఫేవరేట్’ తను చాలా సింపుల్ లైఫ్‌ని ఇష్టపడతారని తెలిపారు.

Read more:

Sai Pallavi: నా మొటిమలు, వాయిస్.. అభద్రతా భావానికి గురిచేశాయి

Advertisement

Next Story

Most Viewed