- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పన్ను ఎగవేతపై ఐటీ కన్ను
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ రేంజ్ పరిధిలో ఐటీ ఎగవేతదారుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పన్ను ఎగవేతదారులను మార్చి చివరికల్లా గుర్తించాలనే లక్ష్యంతో ఆదాయ పన్నుల శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి, డిసెంబర్ నెలల్లో ఆదాయ పన్నుల శాఖ పన్నుల ఎగవేతదారుల కోసం అకస్మిక తనిఖీలు చేయడం సర్వ సాధారణం. గతంతో పోలిస్తే ఆదాయం పెరుగుతున్నా వ్యాపారాలు వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో మాత్రం వ్యత్యాసం ఉంటోంది. వార్షికంగా ఉన్న ఆదాయ వ్యయాల వ్యత్యాసాల అధారంగా తనీఖీలు చేస్తారు. అందుకు సర్వేను ప్రామాణికంగా తీసుకుంటారు.
హైదరాబాద్‌లోని రీజినల్ కార్యాలయం అదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, పాత అదిలాబాద్ జిల్లా(మంచిర్యాల)ను మినహయించుకుని తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే రైస్‌మిల్స్, జిన్నింగ్ మిల్స్ వ్యాపారులు రియల్టర్లు, వ్యాపార వేత్తలు లక్ష్యంగా 8 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తాజాగా నిజామాబాద్ నగరంలో వైద్యుల స్ర్టీట్‌గా పేరున్న ఖలీల్‌వాడిపై ఐటీ శాఖ కన్ను పడింది. మంగళవారం నగరంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులలో సోదాలు నిర్వహించారు. సాధారణంగా మంగళవారం ఆస్పత్రులు రోగులతో కిటా కిటాలాడుతాయి. కానీ, ఐటీ దాడుల పుణ్యమా అని వైద్యులు పెద్దగా కనబడలేదు.
నిశిత పరిశీలన..
గతంలో నిజామాబాద్‌లో ఐటీ దాడుల నేపథ్యంలో డబ్బులను కిటికిల గుండా బయటకు విసిరివేసిన ఘటనలు ఉన్న నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు జరిగే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని నిశిత పరిశీలన చేస్తున్నారు. రెండేండ్ల కిందట నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన వాణిజ్యపన్నుల శాఖలో నకీలీ చాలన్ల కుంభకోణం వ్యవహరంలో రైస్ మిల్లర్లు, వాహనాల షోరుంల నిర్వాహకుల ఆక్రమ దందా బయట పడింది. రూ.300 కోట్లకు పైగా సాగిన కుంభకోణం వ్యవహారం జల్లాలోని కొందరు వ్యాపారుల అక్రమ సంపాదనను, ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు చేయకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యవహారాలను బహిర్గతం చేసింది. అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కమీషన్ ఏజెంట్లు, ఎర్రజొన్నల వ్యాపారులు, మద్యం వ్యాపారులు, బంగారు వ్యాపారుల కోట్ల రూపాయల లావాదేవీల చిట్టా ఇప్పుడు ఐటీ అధికారుల వద్ద ఉందని దాని ప్రకారమే ఇప్పుడు తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రెండు, మూడు వ్యాపార వర్గాలు లక్ష్యంగా సోదాలు జరగ్గా తర్వాత ఎవరి వంతు అని అందరు చర్చించుకుంటున్నారు.
Tags : it raids, nizamabad dist, telangana state