కేంద్రాన్నే తిడతారు.. కేంద్రాన్నే కొనమంటారు: విజయశాంతి

by Shyam |
vijayasnathi
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని, సాగునీటి ప్రాజెక్టులున్నాయని గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి.. నేడు రైతులపై రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తూ కేంద్రాన్ని తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి సోషల్​మీడియా వేదికగా విమర్శలు చేశారు.

రాష్ట్రాలపై కేంద్రం పెత్తతాన్ని ప్రశ్నించే కేసీఆర్.. వరిని కేంద్రమే కొనాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు వెళ్లిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటని ఆమె విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed