ఉద్యోగులకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

by Shamantha N |
ఉద్యోగులకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్
X

దిశ వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 16న దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలవ్వగా.. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులకు వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 సంవత్సరాలకు మధ్య వయస్సు ఉండి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్‌ను కూడా ఇందులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామం చేస్తోంది. వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసి రూ.250కే కరోనా వ్యాక్సిన్ డోస్ ఇవ్వాలని తెలిపింది.

త్వరలో అందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనుండగా.. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ నుంచి బ్యాంకు సంస్ధలు వరకు తమ ఉద్యోగులకు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అయ్యే కరోనా వ్యాక్సిన్ ఖర్చును భరించనున్నట్లు ప్రకటించాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, Accenture, RPG గ్రూప్ ఈ మేరకు ప్రకటన చేశాయి.

ఇక ఉద్యోగులకు అయ్యే కరోనా వ్యాక్సిన్ ఖర్చును భరించాలని అన్ని బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్ అసోషియేషన్ సూచించింది. ఈ క్రమంలో తమ ఉద్యోగులందరి కరోనా వ్యాక్సిన్ ఖర్చును భరించేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed