క్రమశిక్షణ పాటించని అధికారులకు మెమోలు జారీ

by Sridhar Babu |   ( Updated:2021-08-18 00:54:30.0  )
cs-somesh-kumar
X

దిశ సూర్యా పేట : జిల్లాలోని 19మంది అధికారులకు సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం మెమోలు జారీచేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నోటీసులు అందజేసినట్లు సమాచారం. విధుల పట్ల అలసత్వం వహించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రెవెన్యూ (విజిలెన్స్ విభాగం) అధికారులకు సహకరించకపోవడం వంటి కారణాలను నోటీసులో పేర్కొన్నారు. మెమోలు అందుకున్న వారిలో వీఆర్‌ఓల నుంచి తహసీల్దార్ వరకు ఉన్నారు. నోటీసులు అందుకున్న 10 రోజుల్లోపు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి కార్యాలయం, హైదరాబాద్ లో హాజరై వివరణ సమర్పించాలని సీఎస్ సోమేష్ కుమార్ నోటీసులలో పేర్కొన్నారు.

నోటీసులు అందుకున్న అధికారులు వీరే..

  • భద్రయ్య.. తహసీల్దార్, మునగాల మండలం
  • పి.శ్రీదేవి.. ఏవో, సూర్యాపేట కలెక్టరేట్
  • పి.సైదులు.. సూపరింటెండెంట్, కలెక్టరేట్.
  • ఎండీ మోసిన్ బాబు.. సీనియర్ అసిస్టెంట్, కోదాడ తహసీల్దార్ కార్యాలయం.
  • వెంకటరత్నం.. వీఆర్ఓ, గాజులమల్కాపురం, పెన్ పహాడ్ మండలం.
  • ఎస్కే బాలసైదా.. వీఆర్ఓ, గరిడేపల్లి మండలం.
  • ఎస్కే జానిపాష.. కోదాడ గ్రామం.
  • ఎన్.రామారావు.. డిప్యూటీ తహసీల్దార్, చివ్వెంల.
  • బి.వెంకటేశ్వర్లు.. వీఆర్ఓ జాజిరెడ్డిమండల కేంద్రం
  • కూసుపుడి భిక్షం.. వీఆర్ఓ, చిలుకూరు.
  • బి.సురేష్.. వీఆర్ఓ, సూర్యాపేట మండలం.
  • ఎ.వెంకన్న.. వీఆర్ఓ తుంగతుర్తి
  • వై.సోమయ్య.. వీఆర్ఓ, తుంగతుర్తి మండలం.
  • దార రామయ్య.. వీఆర్ఓ, నాగారం మండలం కేంద్రం.
  • వి.ఉప్పలయ్య.. సీనియర్ అసిస్టెంట్, తహసీల్దార్ కార్యాలయం, నాగారం.
  • పి.ఇంద్రకుమార్ .. సీనియర్ అసిస్టెంట్, తహసీల్దార్ కార్యాలయం, ఆత్మకూర్(ఎస్).
  • విజయ రామారావు.. డిప్యూటీ తహసీల్దార్, బొమ్మలరామారం, యాదాద్రి జిల్లా.
  • జగన్నాధరావు.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏఎమ్మార్సీ, నల్గొండలో తిరమలగిరి తహసీల్దార్ గా పనిచేశారు)
  • శివాజీ నాయక్.. శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయం ఈవో భద్రాచలం
    గతంలో ఆత్మకూర్(ఎస్) తహసీల్దార్ గా పనిచేశారు.)
Advertisement

Next Story

Most Viewed