చంద్రయాన్-2 గుర్తించిన చంద్రుడి క్రేటర్‌కు విక్రమ్ సారాభాయి పేరు

by  |
చంద్రయాన్-2 గుర్తించిన చంద్రుడి క్రేటర్‌కు విక్రమ్ సారాభాయి పేరు
X

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో (ISRO) పంపిన చంద్రయాన్-2 (Chandrayaan-2)చంద్రుడిపై గుర్తించిన క్రేటర్‌ (Crater)కు విక్రమ్ సారాభాయి (Vikram Sarabhai) పేరును పెట్టారు. భారత అంతరిక్ష ప్రయోగాల పితామహుడు (Father of Indian Space Exploration)గా పేరొందిన విక్రమ్ సారాభాయి పేరును ఈ క్రేటర్(అగాథం)కు పేరుపెడుతున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh)ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 12న విక్రమ్ సారాభాయి శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా సారాభాయి క్రేటర్‌గా నామకరణం చేసినట్టు వివరించారు. చంద్రయాన్-2 (Chandrayaan-2) గుర్తించిన ఈ క్రేటర్ అపోలో 17, లూనా 21 క్రేటర్‌లకు తూర్పువైపున సుమారు 250నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ అగాథం 1.7 కిలోమీటర్ల లోతున్నట్టు చంద్రయాన్-2 తీసిన 3డీ చిత్రంతో శాస్త్రజ్ఞులు (Scientists) గుర్తించారు.


Next Story

Most Viewed