- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇజ్రాయెల్‌లో బయటపడ్డ అరుదైన టాయిలెట్
దిశ, ఫీచర్స్: పవిత్రమైన జెరూసలేంలో దాదాపు 2,700 సంవత్సరాల క్రితం నాటి ప్రత్యేకమైన టాయిలెట్‌ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మృదువైన, చెక్కిన సున్నపురాయితో నిర్మించిన దీర్ఘచతురాస్త్రాకార క్యాబిన్‌లో ఉన్న టాయిలెట్, పాత నగరంలోని విశాల భవనంలో బయటపడింది. ఇది కూర్చోవడానికి సౌకర్యవంతగా, లోతైన సెప్టిక్ ట్యాంక్‌తో నిర్మించబడింది.
ప్రైవేట్ బాత్రూమ్స్ క్యూబికల్ రూపంలో చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటివి కొన్ని మాత్రమే కనుగొనబడగా.. ధనవంతులు మాత్రమే మరుగుదొడ్లను కొనుగోలు చేయగలరని పరిశోధకులు పేర్కొన్నారు. సెప్టిక్ ట్యాంక్‌లో కనుగొన్న జంతువుల ఎముకలు, మట్టి వస్తువులు ఆ సమయంలో ప్రజల జీవనశైలి, ఆహారాలు, అలాగే ప్రాచీన వ్యాధుల గురించిన సమాచారాన్ని వెల్లడించగలవని వారు వెల్లడించారు. ఆ కాలంలోని రాతి స్తంభాలను కూడా గుర్తించగా, వాటిమధ్య ఉద్యానవనానికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు. అక్కడ నివసించే ప్రజలు బాగా ధనవంతులని ఆర్కియాలిజిస్ట్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ప్రారంభంలో, ఆస్ట్రియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి పురావస్తు శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్ టెల్ లాచిష్‌లో 1450 BC నాటి వర్ణమాల గురించి కీలక ఆధారాలను కనుగొన్న విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ తవ్వకాల సైట్‌లో కనుగొన్న విషయాలు ఆంటిక్విటీ జర్నల్‌లో ప్రచురితం కాగా, కాంస్య యుగం నాటి వర్ణమాలలు సినాయ్ ద్వీపకల్పంలో క్రీస్తుపూర్వం 1800లో ఉద్భవించాయని, క్రీస్తుపూర్వం 1300 నాటికి లెవాంట్‌కు విస్తరించాయని చూపిస్తుంది. అక్కడ నుంచి ఇది మధ్యధరా ప్రాంతం అంతటా వ్యాపించి చివరికి గ్రీక్, లాటిన్ అక్షరాల్లోకి పరిణామం చెందిందని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆధునిక ఇజ్రాయెల్, షెఫెలా ప్రాంతంలోని టెల్ లాచిష్ ప్రదేశంలో ఆస్ట్రియన్ పురావస్తు బృందం ఈ ఆధారాలను కనుగొంది.