- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్టిన రోజు నాడు అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక, ఇండియా మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇద్దరు క్రికెటర్లు అరంగేట్రం చేశారు. జార్ఖండ్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ ఇషాన్ కిషన్ ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. పుట్టిన రోజు (జులై 18) నాడే అతడు జాతీయ జట్టు తరపున తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. బర్తడే రోజే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రెండో భారత క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.
1990లో భారత క్రికెటర్ గురుశరణ్ తన పుట్టన రోజు (మార్చి 8) న్యూజీలాండ్‌పై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషనే ఆ ఫీట్ సాధించాడు. ఇక మహారాష్ట్ర రంజీ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన తొలి వన్డే ఆడాడు. గతంలో ఇంగ్లాండ్ సిరీస్‌లో సూర్యకుమార్ ఎంపికైనా కేవలం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కానీ శ్రీలంక పర్యటనలో తొలి వన్డేలోనే అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. శ్రీలంకతో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ కూడా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుండటం గమనార్హం. ఇషాన్ కిషన్ (క్యాప్ నెంబర్ 235)కు కెప్టెన్ శిఖర్ ధావన్, సూర్యకుమార్‌కు (236) వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ క్యాప్స్ అందించి జట్టులోకి ఆహ్వానించారు.