రేషన్ షాప్‌లలో నయా దందా.. OTP చెప్పు.. మనీ పట్టు..

by Shyam |
rice
X

దిశ, సదాశివపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేషన్ బియ్యం పథకం పక్క దారి పడుతుంది. రేషన్ డీలర్‌ల వల్ల ఇది వ్యాపారంగా మారతుంది. రేషన్ బియ్యం పంపణిలో అక్రమాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐరిస్, ఓటిపి విధానం తీసుకువచ్చంది. దీంతో రేషన్ డీలర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సదాశివపేటలో మొత్తం 49 రేషన్ షాపులు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది రేషన్ బియ్యం నెల నెల తీసుకోవడం లేదు. దీంతో కిలో పది రూపాయల చొప్పున తీసుకుంటాం అని డీలర్లు వినియోగదారులతో బేరం కుదుర్చుకుంటున్నారు. వినియోగదారున్ని ఫోన్ ద్వారా ఓటిపి చెప్పమని చెప్పిన వెంటనే గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు.

దీంతో వినియోగదారులు కూడా ఎక్కడి వెళ్లకుండానే డబ్బులు వస్తున్నాయని సంతోషపడుతున్నారు. రేషన్ షాపులో అయితే ఓటిపి చెప్పామా వెంటనే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు వస్తున్నాయి. రేషన్ షాప్ కి వెళ్లి నిలబడే ఓపిక సామాన్య వినియోగదారునికి లేనందువల్ల అటు రేషన్ షాప్ డీలరు, వినియోగదారుడు ఒకటై ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. పది రూపాయలకు కొన్న రేషన్ షాప్ డీలర్ 15 నుంచి 16 రూపాయల వరకు బయట అమ్ముకుంటున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed