హిందూలో.. ఇకపై ఇండియన్ నావిగేషన్ సిస్టమ్

by Anukaran |
హిందూలో.. ఇకపై ఇండియన్ నావిగేషన్ సిస్టమ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) కలిగిన నాలుగో దేశంగా ఇండియా అవతరించింది. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) కూడా తాజాగా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండియా స్వతంత్రంగా అభివృద్ధి చేసుకున్న ఈ నావిగేషన్ సిస్టమ్‌ను హిందూ మహాసముద్రంలో తిరిగే ఓడల్లో ఉపయోగించుకుంటుండగా.. ఇది భారత సరిహద్దు వెంబడి 1500 కిలోమీటర్ల మేర పనిచేస్తోంది.

ఇది సముద్రంలో తిరిగే ఓడలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఉపయోగపడటంతో పాటు సముద్రంలో పొంచి ఉన్న ప్రమాదాలను పసిగడుతుంది. దీన్ని అభివృద్ధి చేయడంతో, ప్రపంచ దేశాల్లో ఇండియాకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పటివరకు అమెరికాకు చెందిన జీపీఎస్‌ను వినియోగించిన ఇండియా.. దాని స్థానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డెవలప్ చేసిన నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించుకుంటోంది. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్‌ ఆమోదం పొందడానికి రెండేళ్ల సమయం పట్టింది.

Advertisement

Next Story

Most Viewed