- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బీమా కంపెనీలకు కొత్త నిబంధనలు జారీ చేసిన ఐఆర్‌డీఏఐ!
దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్య బీమా పాలసీదారులతో ఎప్పటికప్పుడు సంబంధాలను కొనసాగిస్తూ, పాలసీ గురించి నిర్ధిష్ఠ సమాచారాన్ని వారికి అందించాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు బీమా కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. బీమా కంపెనీలు ఆరోగ్య బీమా కవరేజీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాలసీదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చర్యలను వెంటనే ప్రారంభించాలని, జూన్ 1 లోగా ఐఆర్‌డీఏఐ సూచనలను తప్పనిసరి పాటించాలని స్పష్టం చేసింది. అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
అలాగే, ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించి ప్రాథమిక సమాచారం, పాలసీ నంబర్, మొత్తం బీమా, కవరేజ్ పరిధి లాంటి వివరాలను తెలియజేయాలి. అదేఇవిధంగా పాలసీ వ్యవధి, బీమా వ్యక్తుల సంఖ్య, సెటిల్ చేసిన మొత్తం క్లెయిమ్‌లు, బోనస్ లాంటి అన్ని వివరాలను అందజేయాలని సూచించింది. అంతేకాకుండా, పాలసీదారులకు ఏడాదిలో రెండుసార్లు సమాచారాన్ని అందించాలి. ఆరోగ్య బీమా పాలసీ ఏదైనా క్లెయిమ్ పరిష్కారం అయినప్పుదు, బీమా మొత్తం వివరాలు, అందుబటులో ఉండే పోగైన బోనస్ ఉంటే గనక పాలసీదారునికి తెలియజేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ సెటిల్ అయిన 15 రోజూల్లోగా పాలసీదారుని సమాచారం ఇవ్వాలని నిబంధనల్లో వెల్లడించారు.