ఏఐ, శాటిలైట్‌తో ఇరాన్ అణుశాస్త్రవేత్త హత్య

by Anukaran |   ( Updated:2020-12-07 08:15:19.0  )
ఏఐ, శాటిలైట్‌తో ఇరాన్ అణుశాస్త్రవేత్త హత్య
X

టెహ్రాన్: ఇరాన్ అణుశాస్త్రవేత్త హత్య కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే శాటిలైట్ కంట్రోల్డ్ మెషీన్ గన్‌ను వినియోగించారని ఇరాన్ రెవల్యుషనరీ గార్డ్స్ డిప్యూటీ కమాండర్ అలీ ఫదావి తెలిపారు. గత నెల 27న ఇరాన్ ‌రాజధాని టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన భద్రత‌తో వెళ్తున్న అణుశాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే హత్యకు గురైన విషయం విదితమే. కారులో ఉన్న ఫఖ్రిజాదే ముఖంపైకి మెషీన్ గన్‌ను జూమ్ చేసి, 13 రౌండ్లు కాల్పులు జరిపారని అలీ ఫదావీ తెలిపారు.

ఫక్రిజాదే పక్కనే కూర్చున్న భార్యకు ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం అణుశాస్త్రవేత్త లక్ష్యంగా ముఖంపై కాల్పులు జరిపారని స్పష్టం చేశారు. శాటిలైట్ ద్వారా మెషీన్ గన్‌ను నియంత్రించారని, ఇందుకోసం అత్యాధునిక కెమేరా, ఆర్టిఫిషియల్ ఇంజెలిజెన్స్ ఉపయోగించారన్నారు. సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉగ్రవాదులు ఎవరూ లేరని తెలిపారు. ఇజ్రాయెల్, నిషేధత పీపుల్స్ ముజాహిద్దీన్ ఆఫ్ ఇరాన్‌(ఎంఈకే)లు సంయుక్తంగా అణుశాస్త్రవేత్త‌ ఫక్రిజాదేను హత్య చేశాయని ఇరాన్ ఆరోపిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed