ఇరాన్ సంచలన నిర్ణయం!

by sudharani |
Coronavirus
X

కరోనా వైరస్ బారినపడిన టాప్-3 దేశాల్లో ఒకటైన ఇరాన్, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్‌లో మృతుల సంఖ్య 237కు పెరిగింది. వైరస్ బాధితుల సంఖ్య 7 వేలను దాటిన వేళ, జైళ్లలో ఉన్న నేరస్తులను విడుదల చేయాలని నిర్ణయించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలు చేసి శిక్షను అనుభవిస్తున్న దాదాపు 70 వేల మందిని విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ వెల్లడించారు. ఖైదీల విడుదలపై ఇరాన్ పత్రికలు, వెబ్ సైట్లలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో సమాజంలో అభద్రతా భావం కలుగబోదని ఇబ్రహీం రైసీ వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags: iran, corona, criminals, released

Advertisement

Next Story

Most Viewed