- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ 2024 లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ భారీ స్కోర్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్ వేదికగా.. రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు తరుఫున ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫొర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కోహ్లీ.. ఐపీఎల్ మొత్తంలో 7,500 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఈ మార్కును అందుకున్న ఏకైక ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు. అలాగే మొత్తం ఇన్నింగ్స్‌లో 67 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో కోహ్లీ సెంచరీని పూర్తి చేసుకున్నారు. అలాగే 2024 సీజన్ లో మొట్టమొదటి సెంచరీని కోహ్లీ తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. అలాగే కెప్టెన్ డూప్లేసీస్..44, విరాట్ కోహ్లీ 113 పరుగులతో రాణించగా మిగిలిన ప్లేయర్లు ఎవరు సరిగ్గా రాణించలేదు. దీంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగుల చేసింది. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవాలంటే 120 బంతుల్లో 184 పరుగులు చేయాల్సి ఉంది.