- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలాంటి వారే అలా మాట్లాడతారు.. వారిపై కోహ్లీ ఫైర్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 500 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, స్ట్రైక్‌రేట్ విషయంలో విరాట్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆదివారం గుజరాత్ మ్యాచ్‌లో సుమారు 160 స్ట్రైక్‌రేట్తో ఆడిన అతను 44 బంతుల్లో 70 పరుగులు చేసి విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. మ్యాచ్ అనంతరం కూడా కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ‘నా స్ట్రైక్‌రేట్ గురించి, నేను స్పిన్‌లో బాగా ఆడటం లేదని మాట్లాడటానికి కొందరు ఇష్టపడుతున్నారు. కానీ, నా దృష్టిలో జట్టును గెలిపించడమే ముఖ్యం. 15 ఏళ్లుగా అదే చేస్తున్నా. మీరు మీ జట్లు కోసం మ్యాచ్‌ను గెలిచారో లేదో నాకు కచ్చితంగా తెలియదు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉండకపోతేనే కామెంటరీ బాక్స్‌లో కూర్చొని గేమ్ గురించి మాట్లాడతారు.’ అంటూ చురకలు అంటించాడు.