- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై ఇండియన్ ఫ్యాన్స్‌కు క్లాస్‌పికిన విరాట్ కోహ్లీ
దిశ, వెబ్ డెస్క్: 2023 డిసెంబర్‌లో ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించిన మినీ వేలం జరిగింది. ఈ వేలంలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసుకున్న ముంబై జట్టు అతని కెప్టెన్ గా నియమించింది. దీంతో రోహిత్ స్థానం పాండ్యాకు దక్కడంతో సోషల్ మీడియాలో పాండ్యా ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎస్ 2024 లో వరుసగా పరాజయాలను ముటగట్టుకోవడంతో ప్రతి స్టేడియంలో పాండ్యాకు అవమానమే ఎదురైంది. ముంబై సొంత గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియంలో అయితే.. మరి దారుణంగా రోహిత్ ఫ్యాన్స్ టీజ్ చేశారు. పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా అలానే చేయడంతో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆగ్రహించారు. పాండ్యాకు మద్దతుగా నిలిచి.. ఫ్యాన్స్ కు బుద్ధి చెప్పాడు.
పాండ్యా కూడా భారత జట్టులో ఆడే ప్లేయరే.. ఎందుకు అతన్ని హెలన చేస్తున్నారని ఫ్యాన్స్ గ్యాలరీ వైపు చూసి సైగలు చేసాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పలువురు స్పందిస్తూ.. అతి చేస్తున్న కొంతమంది ఫ్యాన్స్‌కు కోహ్లీ సరైన రీతిలో గడ్డిపెట్టాడని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే.. రోహిత్, కోహ్లీ ఇండియా, ఐపీఎల్ ఎక్కువ రోజులు ఆడరని.. భవిష్యత్ లో ఎక్కువ కాలం ఉండేది యువ ప్లేయర్ అయిన పాండ్యానే అంటూ అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. కాగా గురువారం రాత్రి ఆర్సీబీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.