- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ఢిల్లీ బోణీ కొట్టేనా..?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్-2023లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 50పరుగుల తేడాతో ఓటమిపాలైన ఢిల్లీ.. రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి ఈ లీగ్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు, లీగ్ మొదటి మ్యాచ్‌లో చెన్నయ్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించిన జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్.. రెండో మ్యాచ్‌లోనూ తమ ప్రతాపం చూపించాలనుకుంటోంది. ఈ మ్యాచ్ సొంత గడ్డపై జరుగుతుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ అర్ధసెంచరీతో రాణించి, మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ సహా మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు.
కాబట్టి, వార్నర్‌తో కలిసి పృథ్వీ షా మంచి ఓపెనింగ్ స్కోరు చేయగలిగి, మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తే ఢిల్లీకి తిరుగుండదు. అలాగే, ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా వికెట్లు తీసినా, పరుగులు ఆపడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టిసారించాలి. మరోవైపు, గుజరాత్‌లో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. గత మ్యాచ్‌లో 92పరుగులతో గైక్వాడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్ కాన్వేతోపాటు స్టోక్స్, మొయిన్, రాయుడు వంటి మిగతా బ్యాటర్లతోపాటు బౌలర్ల మద్దతు ఉంటే గుజరాత్ ఖాతాలో రెండో విజయం ఖాయం.