- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL2024: చెన్నైపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. సమిష్టి కృషితో హోం గ్రౌండ్‌లో మరోసారి సత్తా చాటారు. చెన్నై నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించారు. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(31), అభిషేక్ శర్మ(37), మార్కరమ్(50), షాబాద్(18), క్లాసెన్(10) పరుగులతో రాణించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్ జట్టు.. ఆరంభంలో అదరగొట్టినా చివర్లో చతికిలబడింది. కెప్టెన్ గైక్వాడ్(26), అజింక్య రహానే(35), శివమ్ దూబే(45), రవీంద్ర జడేజా(31) తప్ప ఎవరూ రాణించలేదు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్, నటరాజన్, భుననేశ్వర్ కుమార్, షాబాద్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్‌లు తలో వికెట్ తీశారు. చేధనలో హైదరాబాద్ బ్యాటర్లు మొదట విజృంభించారు. అభిషేక్, హెడ్ మెరుపు ఇన్సింగ్స్ ఆడారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు సమర్పించారు. చివరకు లక్ష్యాన్ని ఛేందించి హోం గ్రౌండ్‌లో విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు.