ముంబై ఓటమికి ముమ్మాటికీ అతడే కారణం: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-04-15 11:02:49.0  )
ముంబై ఓటమికి ముమ్మాటికీ అతడే కారణం: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రసవత్తర మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై ముంబైని 20 పరుగుల తేడాతో సీఎస్కే చిత్తు చేసింది. ఈ క్రమంలో ముంబై జట్టు ఓటమిపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆయన ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ముంబై ఓటమికి ముమ్మాటికీ ఆ జట్టు కెప్టెన్ హర్ధిక్ పాండ్యానే కారణమని విమర్శించారు. హర్ధిక్ పాండ్యా వేసిన చివరి ఓవరే ఎమ్ఐ ఓటమికి కారణమైందని అన్నారు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాకు నాలుగో ఓవర్లో బంతి ఇవ్వడమేంటని.. హర్ధిక్ పాండ్యా కెప్టెన్సీ మరీ దారుణంగా ఉందన్నారు.

ఒకే ఓవర్ వేసి 9 పరుగులు ఇచ్చిన శ్రేయస్ గోపాల్‌కు మరో ఓవర్ ఇవ్వకుండా.. షెఫార్డ్‌తో అనవసరంగా రెండు ఓవర్లకు వేయించాడని విమర్శించారు. వాస్తవానికి చెన్నైను 185 పరుగుల వద్ద కట్టడి చేయాల్సి ఉండగా.. హర్ధిక్ పాండ్యా అనవసరంగా లాస్ట్ ఓవర్ వేసి దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని అన్నారు. చివరి ఓవర్‌లో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదేనని గవాసర్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా 26 రన్స్ ఇచ్చాడు. పాండ్యా లాస్ట్ ఓవర్‌లో బౌలింగ్‌లో చెన్నై స్టార్ బ్యాటర్ ధోని మూడు సిక్సర్లు బాది సీఎస్కేకు భారీ స్కోర్ అందించాడు.

Advertisement

Next Story

Most Viewed