- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RCB ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. డూ ఆర్ డై మ్యాచ్‌లో డేంజరస్ ప్లేయర్ రీ ఎంట్రీ
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లోనే అత్యంత ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్ మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మిగిలిన మరో బెర్తు కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌ను చెన్నై, ఆర్సీబీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుని బెంగుళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, రేసులో ముందుకు వెళ్లాలంటే గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టులో కీలక మార్పులు చేసింది. ఫామ్ లేమితో గత కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్న డేంజరస్ ప్లేయర్ మ్యాక్స్ వెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మ్యాక్స్ వెల్ రీ ఎంట్రీతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. టీ20ల్లో హార్డ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న మ్యాక్స్ వెల్ రీ ఎంట్రీతో ఆర్సీబీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో గెలిచి ఎవరూ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటారోననే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.