IPL 2023: అత్యధిక పరుగులు వీరుడు ఆయనే..!

by Hamsa |   ( Updated:2023-04-08 13:20:43.0  )
IPL 2023: అత్యధిక పరుగులు వీరుడు ఆయనే..!
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. పాయిట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ మొదటి స్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ చివరిస్థానంలో ఉంది. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ నిలిచాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన బట్లర్ 79 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన బట్లర్.. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఈ నెల 2న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో బట్లర్ 54 రన్స్ చేశాడు. ఇక పీబీకేఎస్ తో ఏప్రిల్ 5న జరిగిన రెండో మ్యాచ్ లో 19 పరుగులు చేసిన బట్లర్.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేవలం 51 బాల్స్ లోనే 79 రన్స్ చేశాడు. దీంతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు 152 రన్స్ చేసిన బట్లర్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. కాగా 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన బట్లర్.. ఇప్పటి వరకు మొత్తం 2,983 పరుగులు చేశాడు.

Advertisement

Next Story