కీలక సమయంలో చెన్నైకు భారీ షాక్.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం

by Satheesh |   ( Updated:2024-05-07 04:02:32.0  )
కీలక సమయంలో చెన్నైకు భారీ షాక్.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. ఫ్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్లు ఫ్లే ఆఫ్స్‌కు ఒక్క అడుగు దూరంలో నిలువగా.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లు ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకున్నాయి. ఊహించని అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేదు. ఇక, మిగిలిన జట్ల మధ్య ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంది. రాజస్థాన్, కేకేఆర్ దాదాపు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోగా మిగిలిన రెండు స్థానాల కోసం సీఎస్కే, లక్నో, ఎస్ఆర్‌హెచ్, ఢిల్లీ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు యంగ్ అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మతిశా పతిరణ ఈ సీజన్‌ మొత్తానికి దూరం అయ్యాడు.

తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతోన్న పతిరణ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా ఇవాళ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ పతిరణ బరిలోకి దిగలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీజన్‌కు దూరమైనా పతిరణ టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తిరిగి స్వదేశం శ్రీలంకకు బయలేర్దనున్నారు. కాగా, సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న పతిరణ.. కీలకమైన ఫ్లే ఆఫ్స్ ముంగిట దూరం అవ్వడం డిఫెండింగ్ ఛాంపియన్‌కు భారీ ఎదురు దెబ్బేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. డెత్ ఓవర్లలో మతిశా పతిరణ సీఎస్కేకు కీలకంగా మారాడు. పరుగులను నియంత్రించడంతో పాటు అవసరమైన సమయంలో వికెట్లు తీసి జట్టులో ఇంపార్టెంట్ ప్లేయర్‌గా మారాడు.

Advertisement

Next Story

Most Viewed