Virat kohli సూపర్ బ్యాటింగ్.. 35 బాల్స్లోనే హాఫ్ సెంచరీ

by Javid Pasha |   ( Updated:2023-04-10 15:12:44.0  )
Virat kohli సూపర్ బ్యాటింగ్.. 35 బాల్స్లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: కింగ్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సొంత గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 35 బంతుల్లోనే కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. కాగా ఈ నెల 2న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 49 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇక ఏప్రిల్ 6న జరిగిన కేకేఆర్ మ్యాచ్ లో 18 రన్స్ మాత్రమే చేసి కోహ్లీ అవుటయ్యాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ.. ఈసారి ఎలాగైనా ఆ లోటును పూడ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed