ఆదిలోనే గుజరాత్ జట్టుకు భారీ షాక్.. IPL నుంచి కేన్ విలియమ్సన్ ఔట్

by Mahesh |   ( Updated:2023-04-02 14:57:04.0  )
ఆదిలోనే గుజరాత్ జట్టుకు భారీ షాక్.. IPL నుంచి కేన్ విలియమ్సన్ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: గాయాల బెడద స్టార్ ప్లేయర్ల జట్టును వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు దూరం కాగా.. తాజాగా మరో స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టబోయి మోకాలికి గాయం అయింది. దీంతో అతను గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కాగా మోకాలి గాయం నుంచి తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో కేన్ మామ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. కాగా అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుదర్శన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed